అమరావతి : ఏపీలో రావణరాజ్యాన్ని అంతం చేసేందుకు కూటమిగా ఏర్పడ్డామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu) స్పష్టం చేశారు. రావణసూరుణ్ని చంపడానికి వానరసైన్యం రాముడితో అంతా కలిసి పనిచేసిందని , చివరకు ఉడత కూడా సహాయం చేసిందని గుర్తు చేశారు. పల్నాడు (Palnadu District) జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడారు.
ఎన్నికల్లో శవ రాజకీయాలను అడ్డం పెట్టుకుని జగన్ (YS Jagan) వస్తు్ంటే నేను నాయకులతో కలిసి రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడేందుకు కలిసి వస్తున్నామని వెల్లడించారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కావడంతో తామూ కూడా అదే పార్టీతో కూటమిగా ఏర్పడ్డామని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల పాలన పీడకల లాంటిదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి స్వార్థంకోసం పనిచేస్తుంటే టీడీపీ రాష్ట్రం అభివృద్ధి కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇసుకసురులను బోన్లో పెట్టి ఇసుకను పేదలకు ఉచితంగా ఇస్తామని, 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.