అమరావతి : ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో డ్రగ్స్ విక్రయాలు జోరుగు జరుగుతున్నాయి. గంజాయి, గుడుంబాతో పాటు డ్రగ్స్ విక్రయాలపై నిఘావేసిన అధికారులు తరుచూ సంబంధిత వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా విశాఖ పట్నంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 70 గ్రాముల ఎండీఎంఏ, క్రిస్టల్ మెత్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు విశాఖకు చెందిన ఐదుగురు యువకులపై నిఘావేసి ఉంచగా ఆదివారం వాటిని విక్రయిస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. కాగా గత నెలలోనూ ఇంజినీరింగ్, బీబీఏ చదువుతున్న ఐదుగురు విద్యార్థులను విశాఖపోలీసులు అరెస్టు చేసి వారి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు