తిరుమల : టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ( TTD members ) మరో ఐదుగురు శుక్రవారం తిరుమల (Tirumala) ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలోని వేంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు.
సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి (Panabaka Laxmi) , వైద్యనాథన్ కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, సదాశివరావు, జ్యోతుల నెహ్రూ ఉన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, శ్రీవారి ల్యామినేషన్ ఫొటో, టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అందజేశారు . ఈ కార్యక్రమంలో డీఈవోలు లోకనాథం, భాస్కర్, వీజీవోలు సురేంద్ర, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.