అమరావతి : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ( MLCs ) 5 గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన ఐదుగురు ఎన్నికయ్యారు. టీడీపీ తరుఫున కావలి గ్రీష్మ (Greeshma) , తిరుమల నాయుడు, బీద రవి చంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు , జనసేన పార్టీ నుంచి కొణిదెల నాగబాబు(Nagababu) ఎన్నికయ్యారు.
నిన్న , మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై కేవలం 175 సభ్యుల్లో 11 మాత్రమే ఎన్నికయ్యారు. దీంతో పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు లేకపోవడంతో రంగంలోకి దిగలేదు. దీంతో 5 పోస్టులకు ఐదుగురు మాత్రమే కూటమి సభ్యులు నామినేషన్ వేయడంతో వారంతా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితా రాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.