AP News | సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఏపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది.
చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా, నంద్యాల ఏఎస్పీగా మందా జావళి ఆల్ఫోన్కు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే,, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీశ్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్‌కుమార్ చౌదరిను బదిలీ చేసింది.