Fishermen | స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు..స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు
Fishermen | సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు 23 రోజుల తరువాత సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు.
అమరావతి : సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ( Seven fishermen ) 23 రోజుల తరువాత సురక్షితంగా స్వస్థలాలకు ( Home town ) చేరుకున్నారు. వారికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ( MLA Konda Babu ), ఎమ్మెల్సీ రాజశేఖర్( MLC Rajashekar ) , కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. తమవారిని చూసుకుని కుటుంబ సభ్యులు వారిని హత్తుకుని బోరున విలపించారు. వారు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈనెల 3న వేటకు అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఏడుగురు బోటులో చేపల వేటకు బయలు దేరారు. వారంతా ఈనెల 10వ తేదీని తిరిగి రావాల్సి ఉండగా అప్పటి నుంచి అధికారులకు , కుటుంబ సభ్యులకు సమాచారం అందకపోవడంతో గల్లంతైనట్లు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.
ఈ దశలో గత గురువారం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లో ని కోల్కత్తాలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. బోటు ఇంజిన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయామని, తెరచాప వేసుకుని పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద కు చేరుకున్నామని బాధితులు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల జాడను తెలుసుకున్న కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారులు, పోలీసుల సహాయంతో కోల్కత్తా నుంచి తిరిగి క్షేమంగా వారి స్వస్థలాలైన ఓడల రేవుకు తీసుకోచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

