హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్ర మాదం జరిగింది. జవహర్లాల్ నె హ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా లేబొరేటరీలో మంగళవారం రాత్రి విషవాయవు లీకవడంతో అక్కడ పనిచేస్తు న్న కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వారిలో ఒడిశాకు చెందిన ఓ కార్మికుడు చనిపోగా.. అస్వస్థతకు గురైన మరో 9 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అస్వస్థతకు గురైన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వారికి అందుతున్న వైద్యసాయాన్ని పర్యవేక్షించాలని జిల్లా మంత్రులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.