Nellore | నెల్లూరు జిల్లా సంగం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కానిస్టేబుల్ నాగార్జున తన బైక్పై బస్సును వెంబడించి, డ్రైవర్ను అలర్ట్ చేశారు. కానిస్టేబుల్ అప్రమత్తతతో బస్సును నిలిపి 45 మంది ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
బస్సును ఆపేయడంతో ఇంజిన్లో నుంచి మంటలు రావడం తగ్గింది. ప్రమాదం నుంచి కాపాడినందుకు కానిస్టేబుల్ నాగార్జునను ప్రయాణికులు ధన్యవాదాలు చెప్పారు. కాగా, ఆ బస్సులోని ప్రయాణికులు వేరే బస్సులో గమ్యస్థానానికి పంపించారు.