Ernakulam Express | విశాఖపట్నం దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు.
ఆదివారం రాత్రి దువ్వాడ మీదుగా బయల్దేరిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అనకాపల్లికి ఆలస్యంగా వచ్చింది. అక్కడి నుంచి బయల్దేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే బీ1 బోగీలో ఒకరు సజీవదహనం అయ్యారు. మృతుడిని వైజాగ్‌కు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు.
కాగా, రైల్వే ఉన్నతాధికారులు ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ-f మార్గంలో రైళ్లన్నీ నిలిపివేశారు. అర్ధరాత్రి 3.30 గంటలు దాటిన తర్వాత కాలిపోయిన రెండు బోగీలను తొలగించారు. ప్రమాదం జరగడంతో రెండు బోగీల్లోని ప్రయాణికులు చలిలోనే స్టేషన్లో చాలాసేపు పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. దీంతో వారిని రైల్వే అధికారులు.. మూడు ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. సామర్లకోటలో 2 ఏసీ బోగీలను జతచేసి అక్కడి నుంచి ఎర్నాకుళం తరలించనున్నారు.
Massive #Fire 🔥 broke out in two AC coaches of #ErnakulamExpress, at #Elamanchili in #Anakapalli district, Luckily No Casualty reported.
A Major Tragedy [#TrainFire] was Averted, after two AC coaches of the #Tatanagar–#Ernakulam Ernakulam Express train (No.18189) catches fire pic.twitter.com/0AP9zyo4vf— Journalist Naresh (@JournalistNari) December 28, 2025