Fire @ Amarraja | ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా కంపెనీలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ షర్క్యూట్‌తో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. అగ్ని కీలలు భారీగా ఎగసి పడుతున్నాయి. ప్రమాదం సంగతి తెలియగానే భారీగా అక్కడికి తరలి వచ్చిన ఫైరింజన్లతో అగ్ని మాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల్లో అమర్‌రాజా కంపెనీకి భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తున్నది.
ఈ ప్రమాదం సంగతి తెలియగానే పోలీసు, పౌర అధికారులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ నాయుడిది ఈ అమర్ రాజా కంపెనీ. ఈ కంపెనీ బ్యాటరీల తయారీలో ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న సంగతి తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.