అమరావతి : ఏపీ మంత్రి విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్లోచోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అవకాశం ఇచ్చినందుకు ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ బీసీ మహిళకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం, తనకు మంత్రి పదవి అవకాశం కల్పించడం కలలో కూడా ఊహించలేదని అన్నారు.
తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చినందుకు కష్టపడి ప్రభుత్వానికి, పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు . అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేబినెట్లో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాగా కొత్త మంత్రుల సామాజిక సమీకరణాలు ఇలా ఉన్నాయి. బీసీ నుంచి 10 మంది, కాపు నుంచి 4, రెడ్డి వర్గం నుంచి 4, ఎస్సీ నుంచి 5గురు, ఎస్టీ, మైనార్టీ నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలో తీసుకున్నట్లు తెలిసింది .