విశాఖలో విషాదం.. ప్రాణ వాయువు అందక ఆగిన చిన్నారి ఊపిరి
విశాఖలో విషాదం | సకాలంలో ప్రాణ వాయువు అందక ఓ 15 నెలల చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ఈ విషాద ఘటన విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో చోటు

విశాఖపట్టణం : సకాలంలో ప్రాణ వాయువు అందక ఓ 15 నెలల చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ఈ విషాద ఘటన విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ ఉద్యోగి వీరబాబు కూతురు(15 నెలలు) గత నాలుగైదు రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో ఆ చిన్నారికి కరోనా పరీక్షల్లో భాగంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు చేయించారు. ఆ ఫలితం నెగిటివ్‌గా వచ్చింది.
రెండు రోజుల క్రితం మళ్లీ జ్వరం రావడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించి సిటీ స్కాన్ చేశారు. ఈ పరీక్షలో ఆ పాప కరోనా వ్యాధి బారిన పడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు మెరుగైన చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి నిన్న తరలించారు. కానీ వైద్యులు ఆస్పత్రిలో సకాలంలో చేర్చుకోలేదు. కనీసం గంటన్నర పాటు వేడుకున్న తర్వాత ఆ చిన్నారిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రాణ వాయువు అందక చిన్నారి ఊపిరి ఆగిపోయింది. వైద్యులు సకాలంలో చేర్చుకుని ఉంటే తమ పాప బతికి ఉండేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవికూడా చదవండి..
విజయోత్సవ ర్యాలీలపై రాష్ర్ట ఎన్నికల సంఘం నిషేధం
కొవిడ్ వార్డులోనూ పుస్తకాలతో కుస్తీ.. కానీ పరీక్షలు వాయిదా
కీలక నిర్ణయం.. ఆ దేశంలో బుర్ఖాపై నిషేధం
కూతురితో మాట్లాడుతున్నాడని కాళ్లు, చేతులు నరికేశారు..
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతి బాధాకరం : మంత్రి హరీశ్ రావు
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
నోస్టాక్ బోర్డు.. అయినా టీకా కోసం బారులుతీరిన జనం
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

