అమరావతి : ఏపీలో(Andhra Pradesh) రెండు జిల్లాలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురంలో ఆరునెలల కుమారుడికి ఉరివేసి భార్యభర్తలిద్దరు ఉరివేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పల్నాడు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు కూతుళ్లను కాలువలో పడేసి తాను ఆత్మహత్యకు ప్రయత్నించగా కూతుళ్లు గల్లంతు కాగా తండ్రిని స్థానికులు కాపాడారు. పల్నాడు (Palnadu ) జిల్లా ముప్పాళ్ల అద్దంకి బ్రాంచి కాలువలో తండ్రి తన ఇద్దరు బాలికలు యామిని(11), కావ్య(7)ను తోసేశాడు.
అనంతరం తాను అదే కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు తండ్రిని కాపాడగా ఇద్దరు బాలికలు కాలువలో గల్లంతయ్యారు. వీరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.