అమరావతి : ఏపీలోని ప్రకాశం( Prakasam) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లారీ, కారు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మహానంది దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులంతా బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.