అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road President) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మరణించారు. అనంతపురం(Anantapuram) జిల్లాలోని శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద కారు లారీని ఢీకొట్టింది. కారు టైరు పగిలి అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న అనంతపురం ఇస్కాన్ (Iscon) టెంపుల్కు చెందిన భక్తులు మృతి చెందారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.