అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో(Annayamya district) సోమవారం అర్దరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident ) నలుగురు చనిపోగా మరొకరు చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న సీఎంఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ( Private Bus,) ఆటో(Auto) ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అన్నమయ్య జిల్లా దేవపట్ల పంచాయతీ వంగమల్లవారిపల్లిలో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తున్న ఓ కుటుంబం చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను వేగంగా ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న 9 మందిలో నలుగురు మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. షాహీరబీ,నూరుల్లా, ఖాదర్వల్లి, బావాజాన్లు స్పాట్లో చనిపోగా చికిత్సపొందుతూ దిల్సాద్ అనే మహిళ మంగళవారం మృతి చెందింది.
మృతి చెందిన నలుగురి మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కలకడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంచంద్రారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.