అమరావతి : రెవెన్యూ అధికారులు తనకు పట్టాపాస్ పుస్తకం ఇవ్వడం లేదంటూ పెట్రోల్ పోసుకుని ఓ రైతు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు . శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు తహసీల్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. నిప్పంటించుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న కానిస్టేబుల్, స్థానికులు అడ్డుకున్నారు. ఐదేళ్లుగా పాస్ పుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతు బోరున విలపించాడు.
అక్కడి వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. బాధితుడు రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో ముందు జాగ్రత్తగా అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.