అమరావతి : ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీ -2025కి ( Mega DSC ) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం హాల్ టికెట్లు ( Hall Tickets ) విడుదల చేసింది. జూన్ 6 నుంచి 30 వరకు జరుగనున్న పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను డౌన్లోడ్ కోసం వెబ్సైట్లో ఉంచారు. మొత్తం 17 పేపర్లకు సంబంధించిన నమూనా పరీక్ష ను విద్యాశాఖ అధికారులు అందుబాటులో తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు స్వీకరించారు.