Vijayasai Reddy | హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజికవర్గాలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. అదే భారత దేశానికి రక్ష.. శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు.
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి.. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆయన.. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అప్పటి నుంచి చాలాకాలం వరకు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ మళ్లీ కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అని.. ఆయన్ను ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. తాజాగా హిందూ మతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూసి విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి మళ్లీ రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక జాతీయ పార్టీలో ఆయన చేరబోతున్నారని.. ఆ ఉద్దేశ్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక చర్చ నడుస్తోంది.
హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 7, 2025