Viveka murder case : నేనెవరినీ బెదిరించలేదు: ఎర్ర గంగిరెడ్డి
Viveka murder case | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.

అవమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్వయానా బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తనకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని, వివేకాతో సన్ని హితంగా ఉండటం వల్లే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. సీబీఐ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నదని త్వరలో వాస్తవాలు వెలుగుచూస్తాయని గంగిరెడ్డి పేర్కొన్నారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్య తనపై చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. రంగన్నను వివేకా ఇంట్లో చూశానే తప్పా ఏ రోజూ మాట్లాడలేదన్నారు. అతడు ఏం ఆశించి తనపై ఆరోపణలు చేస్తున్నాడో అర్థకావడం లేదన్నారు. తానెవరినీ బెదిరించలేదని, అలా చేసినట్లు ఎక్కడా తనపై కేసులు లేవని గంగిరెడ్డి అన్నారు.
చాలాసార్లు మాట్లాడాను : రంగన్న
ఇదిలా ఉండగా గంగిరెడ్డి వ్యాఖ్యలపై వాచ్మెన్ రంగన్న సైతం స్పందించారు. తాను గంగిరెడ్డితో చాలాసార్లు మాట్లాడానని, ఇప్పుడు గంగిరెడ్డి తానెవరో తెలియనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. తనకేమీ కాదని అంటేనే సీబీఐకి అన్ని విషయాలు చెప్పానన్నారు. నిన్న జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

