Srisailam | శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ఓ ఉద్యోగి వ్యవహరించాడు. మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మల్లికార్జునస్వామి దర్శనం కోసం భక్తులు ఆలయ క్యూ కంపార్ట్మెంట్లో ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరుకావడం గమనించిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆలయ క్యూలైన్ దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ ఏఈవో జి.స్వాములు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో భక్తులు ఆయనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగి మద్యం తాగి వస్తే ఏం చేస్తున్నారంటూ ఆయన్ను నిలదీశారు. ఆలయ పవిత్రతను పోగొడుతున్నారని ఈ సందర్భంగా భక్తులు మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం తాగి విధులకు వస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలంటూ ఆలయ ఈవో పెద్దిరాజుకు శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం దేవస్థానంలో తాగి పనిచేస్తున్న సిబ్బందిని చితకబాది.. పోలీసులకు అప్పగించిన భక్తులు.
ప్రైవేటు సిబ్బంది అంటున్న ఆలయ అధికారులు.#Srisailam #MallikarjunaSwamyTemple #Devotees #NewsUpdates #Bigtvlive pic.twitter.com/HWvWKue7xC
— BIG TV Breaking News (@bigtvtelugu) August 2, 2024