అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీల(Council MLCs) భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్(Schedule, ) ను విడుదల చేసింది. దీని కోసం ఈనెల 25 న ఎన్నికలకు నోటిఫికేషన్ను జారీ చేయనుంది. జూలై 2 నుంచి నామినేషన్ల స్వీకరణ, 2న నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణ, 12 న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదేరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
వైసీపీ(YCP) పాలనలో ఎమ్మెల్సీగా పనిచేసిన రామచంద్రయ్య టీడీపీలో చేరడంతో ఆయనను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మండలి చైర్మన్ మోషన్ రాజ్ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేశారు. వైసీపీఎమ్మెల్సీగా షేక్ మహ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.