AP Elections | గుంటూరు : తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్‌పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ స్టేషన్లోకి క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఓటరు.. ఎమ్మెల్యే శివకుమార్‌ను నిలదీశారు. ఆగ్రహాంతో ఊగిపోయిన ఎమ్మెల్యే.. ఓటరుపై చేయి చేసుకున్నాడు. బాధిత ఓటరు కూడా ఎమ్మెల్యేను కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఒకరిని ఒకరు కొట్టుకున్న ఎమ్మెల్యే మరియు ఓటర్
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీసిన ఓటర్.
ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంపపై కొట్టాడు.. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. pic.twitter.com/6f23YW3X9c
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024