అమరావతి : ఫెయింజల్ తుపాన్ (Fainjal cyclone) ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. విశాఖ(Visaka), తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు(Nellore) తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
కుమారధార, పసుపుధార(Pasupudara), పావినాశనం, ఆకాశగంగ, జలాశయాల్లో పూర్తిస్థాయికి నీటి మట్టం చేరింది. తిరుమలలో(Tirumala) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 మీటర్ల మేర ముందుకు రావడంతో తీర ప్రాంతవాసులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. భారీవర్షాల కారణంగా విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమాన సర్వీసులను రద్దు చేశారు.