అమరావతి : రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు ఐపీఎస్ (IPS) , ముగ్గురు ఐఏఎస్ (IAS) అధికారులను ముకుమ్మడిగా బదిలీ (Transfers) చేసింది . వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ ( SP Tirumaleshwar) , పల్నాడు జిల్లాఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డిని, చిత్తూరు ఎస్పీ జాషువా , గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది.