అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేడు ఎర్త్‌అవర్ పాటించాలని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ పిలుపునిచ్చారు. రాత్రి 8.30 నుంచి 9.30 నిమిషాల వరకు దీనిని పాటించాలని కోరారు. గంటపాటు విద్యుత్ దీపాలు, పరికరాలు ఆపివేయాలని సూచించారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు ఉపయోగించాలని వివరించారు. ప్రపంచ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పునరుత్పాదక సహజ వనరుల వినియోగం స్థిరంగా ఉండేలా చూడడం, కాలుష్యాన్ని తగ్గించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిఏటా మార్చి 26 వతేదీన ఎర్త్ అవర్‌ను పాటిస్తున్నారు.
గ్రహం సహజ పర్యావరణం కాపాడటం, ప్రకృతికి అనుగుణంగా మానవులు జీవించే భవిష్యత్తును నిర్మించడం, వ్యర్థ వినియోగాన్ని భారీ ఎత్తున తగ్గించటానికి 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లైట్స్ అవుట్ ఈవెంట్‌గా ఎర్త్ అవర్‌ను ప్రారంభించారు.