Srisailam | దసరా సందర్భంగా ఈ నెల 26 నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీశైలం ఈవో ఎస్ లవన్న ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. దసరా మహోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, దేవాదాయశాఖ కమీషనర్ హరిజవహర్‌లాల్, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, ట్రస్ట్‌బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు వేదాశీర్వచనం చేయించి అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదం, జ్ఞాపిక అందచేశారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్, విద్యుత్, అటవీ , సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలను దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.