Dussehra | ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గ గుడి ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సోమవారం నాడు విడుదల చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ మహోత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు.
సెప్టెంబర్ 29వ తేదీన మూల నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు నాయుడు కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. ఈ ఏడాది కొత్తగా కాత్యాయని దేవి ఆలంకరణ ఉంటుందని పేర్కొన్నారు.
ఏ రోజు ఏ అలంకారం అంటే..
సెప్టెంబర్ 22వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా
సెప్టెంబర్ 23వ తేదీన శ్రీ గాయత్రి దేవిగా
సెప్టెంబర్ 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవిగా
సెప్టెంబర్ 25వ తేదీన శ్రీ కాత్యాయని దేవిగా
సెప్టెంబర్ 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీ దేవిగా
సెప్టెంబర్ 27వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా
సెప్టెంబర్ 28వ తేదీన శ్రీ మహాచండీ దేవిగా
సెప్టెంబర్ 29వ తేదీన శ్రీ సరస్వతి దేవిగా
సెప్టెంబర్ 30వ తేదీన శ్రీ దుర్గాదేవిగా
అక్టోబర్ 01వ తేదీన శ్రీ మహిషాసురమర్దినిగా
అక్టోబర్ 02వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు కనిపించనున్నారు. అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం ఉంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.