తిరుమల : ఈనెల 7 చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 3.30 గంటల నుంచి 8వ తేది ఉదయం 3 గంటల వరకు తిరుమల ( Tirumala ) లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 8న దర్శనం కొరకు 7వ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు ( Recommendation letters ) స్వీకరించబడవని పేర్కొన్నారు.
8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నామని స్పష్టం చేశారు. 7న శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్పు చేశామని వివరించారు. సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15న వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు.
టీటీడీకి టాటా ఏస్ వాహనం
తిరుపతికి చెందిన టాటా మోటార్స్ వరలక్ష్మీ ఆటో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5.06 లక్షలు విలువైన టాటా ఏస్ ప్రో వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామ కృష్ణకు తాళాలను అందజేశారు.