అమరావతి : చలికాలంలో పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం వరుసగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. భారీపొగమంచుతో వాహనాల రాకపోకలు కనిపించకపోవడంతో ఒకదానికొకటి 15 వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో రహదారిపై గంట పాటు రాకపోకలు స్థంభించిపోయాయి.