Godavari | గోదావరి నది వరద ఉద్ధృతితో పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా రద్దు
Godavari | తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ( Godavari River) కి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది .
అమరావతి : తెలంగాణ, ఏపీలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ( Godavari River) కి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది . దీంతో కోనసీమ జిల్లాలతో పాటు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న మండలాలకు వరద నీరు వచ్చి చేరుతుంది . ఈ కారణంగా పాపికొండల విహారయాత్రను( Papikondalu Tour Cancell) పర్యాటక శాఖ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
కోనసీమ జిల్లా గోదావరి నది పాయలో పెరిగిన వరద ప్రవాహంతో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, జిపెద్దపూడిలంక ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామస్థులు పడవలతో రాకపోకలు సాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎదువాగు వంతెన నీట మునిగింది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలో భారీ వర్షాల చింతూరు-వరరామచంద్రపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద ఉన్న శబరి నీటిమట్టం 29.5 అడుగులకు చేరుకుంది. కొండరాజపేట వద్ద రహదారిపై వరద నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

