అమరావతి : చిత్తూరు జిల్లా (Chittoor district) గంగాధర నెల్లూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల (Insecticide ) మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని ఆస్పత్రికి తరలించారు.
చికిత్సపొందుతూ శనివారం నాగరాజారెడ్డి, జయంతి దంపతులు మృతి చెందారు. కుమారుడు, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.