అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఏసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది . హైదరాబాద్ నుంచి విజయవాడ ( Vijayawada Bus ) కు వెళ్తున్న అమరావతి ఏసీ బస్సు డ్రైవర్నాగరాజుకు గుండెపోటు (Driver collapses) రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 19 మందితో బయలు దేరిన బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సును పక్కకు ఆపి సీటులోనే మృతి చెందాడు. ఒల్లపూడికి చెందిన డ్రైవర్ నాగరాజు విజయవాడ డిపోలో పనిచేస్తున్నాడని అధికారులు వివరించారు. ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించినట్లు తెలిపారు.