తిరుమల : ఆపదమొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇద్దరు భక్తులు రూ. 21 లక్షలను విరాళంగా( Donations ) అందించారు. హైదరాబాద్కు చెందిన కుమారి మొరబోయన చరిష్మా శుబ్షిత టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు ( Anna Prasadam Trust ) కు రూ.11,11,111 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఉప్పాల చక్రపాణి తన కుటుంబ సభ్యులతో కలిసి బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడెల శివరామకృష్ణ పాల్గొన్నారు.