తిరుమల : ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే ఇద్దరు భక్తులు శనివారం తిరుమల ( Tirumala) బర్డ్ ట్రస్ట్ ( Bird Trust) కు రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు దాతలు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు చెక్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీకి ఒక రోజు ఆదాయం రూ. 3.68 కోట్లు
తిరుమలలో శ్రీవారి హుండీకి శుక్రవారం రూ. 3.68 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా 25,063 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందన్నారు.