తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి స్వర్ణ పాదాలు విరాళం
Donation| తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సత్య నారాయణ స్వర్ణ పాదాలు విరాళంగా సమర్పించారు.
తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సత్య నారాయణ స్వర్ణ పాదాలు విరాళంగా సమర్పించారు. ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తికి అలంకరించేందుకు ఈ పాదాలను అందించారు. 85 గ్రాముల బరువుగల ఈ పాదాల విలువ రూ.4 లక్షలు అని భక్తుడు తెలిపారు. ఈ స్వర్ణపాదాలను ఆలయంలో ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరికి భక్తుడు అందజేశారు.
కాగా సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 5వ తేదీ విజయ దశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.
ఆర్జిత సేవలు రద్దు
నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను,సెప్టెంబరు 30న లక్ష్మీపూజ, అక్టోబరు 5న అష్టోత్తర శత కలశాభిషేకం సేవలు రద్దు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

