తిరుమల : తిరుమల శ్రీవారికి కరూర్ వైశ్యాబ్యాంక్ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. ఇవాళ ఆలయ పరిసర ప్రాంతాల్లో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి. రమేశ్‌బాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వాహనాల తాళాలు అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సుమారు రూ. 30 లక్షల విలువగల 8-సీటర్ బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో కెవిబి డైరెక్టర్లు, విజిఓ బాలిరెడ్డి, డీఐజానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.