అమరావతి : ఏపీ సాంఘిక సంక్షేమం, దివ్యాంగులశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swamy ) బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ముందుగా సచివాలయంలో కేటాయించిన ఛాంబర్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎమ్మెల్యేలు అధికారులు, కూటమి నాయకులు మంత్రికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారని ఆరోపించారు.
అభివృద్ధి(Development), సంక్షేమమే(Welfare) ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు(CM Chandra Babu) తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా సేవలందిస్తానని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో రద్దయిన సీట్లను పునరుద్దరిస్తామని వెల్లడించారు.
విద్యార్థులకు బకాయిలు ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేస్తామని ప్రకటించారు. వాలంటీర్లను తొలగిస్తామని తామెక్కడా చెప్పలేదని, పెన్షన్లను సచివాలయ ఉద్యోగులతో మొదటి తారీఖున సక్రమంగా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు.