అమరావతి : ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను(MLC Duvvada Srinu) తో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి (Divvela Madhuri ) రోడ్డు ప్రమాదాని( Road Accident) కి గురైంది. ఆదివారం ఆమె ప్రయాణిస్తున్న కారు ఆగిఉన్న మరో కారును ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద జరిగిన ఘటన జరిగింది. గాయపడ్డ మాధురిని పలాస ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో మాట్లాడుతూ ‘నేను డిప్రెషన్లో ఉన్న .. చనిపోయేందుకే బయటకి వచ్చానని’ పేర్కొన్నారు.
గత రెండురోజులుగా ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ వ్యవహారంలో దువ్వాడ శ్రీను భార్య శ్రీవాణి మాధురిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆరోపిస్తూ శ్రీను ఇంటిపై కూతుళ్లతో కలిసి దాడి చేసింది. దివ్వెల మాధురి అనే మహిళతో సంబంధం పెట్టుకుని తమను వదిలేశారని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై దివ్వెల మాధురి కూడా స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్‌ను తాను ట్రాప్ చేయలేదని స్పష్టం చేశారు. తననే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి రాజకీయంగా తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు. వాణినే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని. ఇప్పుడు తానెవరో తెలియదని అంటుందని విమర్శించారు.
దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏవైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. స్వార్థంతో వాణి తనపై నిందలు వేశారని.. తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని మాధురి ఆరోపించారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌లా తనతో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం కలిసే ఉంటున్నామని స్పష్టం చేశారు. అయితే తమది సహజీవనం కాదని.. అడల్ట్రీ రిలేషన్ అని పేర్కొన్నారు.