అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నిర్వహించిన రైతు సంబరాల ( Farmers Festival ) కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని తలపెట్టింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా ఆలమూరులో ఎద్దుల బండ్లతో రైతు సంబరాలు నిర్వహించారు.
ర్యాలీలో బెలూన్ పేలడంతో బెదిరిన ఎద్దులు ఒక్కసారిగా పరుగెత్తడంతో కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు (MLA Satyanandarao) , టీడీపీ నాయకులు కిందపడ్డారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సతీష్రాజుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.