ఆదివారం 29 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 21, 2020 , 11:17:55

క‌ర్నూల్ జిల్లాలో కూలీకి దొరికిన 'వ‌జ్రం'

క‌ర్నూల్ జిల్లాలో కూలీకి దొరికిన 'వ‌జ్రం'

క‌ర్నూల్ : ‌జిల్లాకు చెందిన ఓ మ‌హిళా కూలీ ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అయిపోయింది. గ‌త కొన్ని రోజులుగా తుగ్గ‌ళి మండ‌లంలోని జొన్న‌గిరి, ప‌గిడిరాయి గ్రామాల స‌రిహ‌ద్దుల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాలు త‌గ్గిన త‌ర్వాత నిన్న వేరుశ‌న‌గ పొలంలో కూలీలు ప‌నులు చేస్తుండ‌గా.. ఓ మ‌హిళా కూలీకి వ‌జ్రం దొరికింది. ఈ ప్రాంతం రంగురాళ్ల‌కు కూడా ప్ర‌సిద్ధి. 7 క్యారెట్ల విలువైన వ‌జ్రాన్ని గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ. 11 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశాడు. అంతేకాకుండా 2 తులాల బంగారం కూడా ఆమెకు ఇచ్చాడు. అయితే ఈ వ‌జ్రం విలువ కోటి రూపాయాల దాకా ఉంటుంద‌ని స్థానికులు భావిస్తున్నారు.