తిరుమల : పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో టీటీడీ ( TTD ) ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు ( Thiruppavai Pravachanalu ) చేయనున్నారు.
ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్లో 76, తెలంగాణలో 57, తమిళనాడులో 73, కర్ణాటకలో 21, పాండిచ్చేరిలో 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు.