Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం, ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. దాంతో శ్రీగిరులన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలన్నీ సందడిగా మారాయి. ఈ నెల 27 నుంచి 37 వరకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఐదురోజుల పాటు ఆలయంలో స్పర్శ దర్శనాలను నిలిపివేయనున్నారు. కేవలం భక్తులకు అలంకార దర్శనాలను మాత్రమే కల్పించారు. ఉత్సవాలకు ముందుగానే భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలకు కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Srisailam Temple
కర్నాటక నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాల మీదుగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి కాలి నడకన శ్రీశైలం చేరుకుంటారు. ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటారు. భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాటు చేసింది. కైలాసద్వారం – భీముని కొలను మార్గంలో భక్తులకు మంచినీళ్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా.. సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక దర్శనానికి 3గంటలు, ఉచిత దర్శనానికి 6గంటల సమయం పట్టింది. మరో వైపు శ్రీశైలంలో మొబైల్ సిగ్నల్స్ లేక భక్తులు ఇబ్బందిపడ్డారు. భక్తులకు ఎలాంటి కలుగకుండా అర్ధరాత్రి ఆలయం మూసే వరకు ఈవో శ్రీనివాసరావు, పీఆర్వో శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple