Srisailam | శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. రాత్రిళ్లు ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచరిస్తున్నది. తాజాగా రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర కనిపించింది. స్థానికులు, అక్కడికి వచ్చని పలువురు భక్తులు చిరుతపులి ఫొటోలను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. గత మూడు నెలల కిందట ఔటర్ రింగ్ రోడ్లోని రుద్రాపార్క్ సమీపంలో చిరుత కనిపించింది. తాజాగా రత్నానంద స్వామి ఆశ్రమానికి దగ్గర రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.