తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు గల భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 88,497 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 19,054 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.34 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ.51 లక్షలు విరాళం
చెన్నైకు చెందిన టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.51 లక్షలు విరాళంగా అందించింది.ఈ విరాళం చెక్కును సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ శ్రీనివాసన్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరికి ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.