అమరావతి : తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో అదుపుతప్పి జీడిపిక్కలతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (Compensation) అందిస్తామని ప్రకటించింది. బాధితులకు త్వరలో పరిహారం అందజేయనున్నామని ఎమ్మెల్యే వెంకటేశ్వరావు (MLA Venkateshwar Rao) వెల్లడించారు.
జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ వ్యాన్ (Mini Van) మంగళవారం బయల్దేరింది. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యాన్ బోల్తాపడింది. దీంతో జీడిపిక్కల కింద ఇరుక్కుని ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఈ ఘటనలో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.