Deputy CM | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్‌కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. పర్యావరణం అనుకూలంగా లేఖపోవడంతో ఆఖరి నిమిషంలో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాపట్లలో గురువారం పర్యటించాల్సి ఉంది. అయితే, జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తున్నది. దీంతో తన పర్యటనను రద్దుచేసుకున్న పవన్.. మరోసారి బాపట్ల వెళ్లాలని నిర్ణయించారు.
షెడ్యూలు ప్రకారం అటవీ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేలా సూర్యలంక రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో నిర్మించిన అమరుల స్థూపాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించాల్సి ఉన్నది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 23 మంది అటవీ అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు.. రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో పవన్ కల్యాణ్ నాటాల్సి ఉంది.