అమరావతి : ఇద్దరు మహిళలను వివస్త్రను చేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా నందిగామ వద్ద స్థానికులు ధర్నా నిర్వహించారు. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైటాయించి నిరసన తెలుపడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో రెండు రోజుల క్రితం బంగారం కాజేశారంటూ ఇద్దరు మహిళలను వివస్త్ర చేసి వారిని చితకబాదారు.
బాధితులకు న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా బీసీ మహిళలు తరలివచ్చి డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.