ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో బ్యాన్ చేసిన సాక్షి, టీవీ 9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఆదేశించింది. కేబుల్ టీవీ ఆపరేటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కాగా, న్యూస్ ఛానల్స్ పునరుద్ధరణపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది.
ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయడం చట్ట విరుద్ధమని ఎన్బీఎఫ్ పేర్కొంది. ఏపీలో ఏకపక్షంగా న్యూస్ ఛానల్స్‌ను బ్యాన్ చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక ఉత్తర్వులు ఇచ్చిందని అభిప్రాయపడింది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చారని తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారిదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు చాటిచెప్పిందన్నారు.
కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికార సంస్థలను ఎన్బీఎఫ్ కోరింది. భవిష్యత్తులోనూ ఛానల్స్ ప్రసారాలను అడ్డుకోవడంపై ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది.
మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని తెలిపారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని గుర్తుచేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ వాపోయారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయటపడ్డాయని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.