అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రాబోయే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను(Cyclone) ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశంముందని పేర్కొన్నారు.
కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాబోయే 24 గంటల్లో ప్రకాశం, బాపట్ల,కృష్ణా, తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు. శని, ఆదివారాల్లో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. అల్లూరి జిల్లా జి.మాడుగులలో4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపట్టులో 5.8, చింతపల్లిలో 6.8, డుంబ్రిగూడలో 7.8 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.